తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. బీసీ గురుకులాల్లో 1698 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. దీనికనుగుణంగా ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో టీజీటీ పోస్టులు 1071, పీఈటీ 119 ఉన్నాయి. వీటితో పాటు 36 ప్రిన్సిపల్ సహా ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నుది.

– కేశవ