రాయలసీమలో ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు.. 75 వేల మందికిఉద్యోగాలు

వైయస్ఆర్ జిల్లా కొప్పర్తిలో వైయస్ఆర్ జగనన్న ఇండస్ట్రీయల్ హబ్, వైయస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానిఫాక్చరింగ్ క్లస్టర్ ను ప్రారంభించారు సీఎం వైయస్ జగన్. కొప్పర్తి సెజ్ లో ఇండస్టీయల్ పార్క్ లను అభివృద్ధి చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ..
ఎలక్ట్రానిక్ హబ్ ద్వారా దాదాపు 75 వేల మందికి ఉద్యోగ అవకాశాలు. రాబోయే రోజుల్లో రాయలసీమ రూపు రేఖలు మారతాయన్నారు. మెగా ఇండస్ట్రీయల్ పార్క్ కోసం రూ. 1585 కోట్లు వెచ్చించామని.. ఇప్పటికే రూ. 100 కోట్లు ఖర్చు చేసామని వెల్లడించారు.

jagan
jagan

3164 ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు.. ఏప్రిల్ కల్లా 1800 మందికి ఇక్కడ ఉపాధి కూడా లభిస్తుందన్నారు. ఈ మెగా పార్కును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని.. ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఇదే చోట పనిచేస్తారని పేర్కొన్నారు. ఇదే హబ్ లో ప్రస్తుతం 6 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని.. 6 నెలల్లో 7,500 ఉద్యోగాలు కంపెనీల ద్వారా రానున్నాయని చెప్పారు సీఎం వైయస్ జగన్. మెగా ఇండస్ట్రీయల్ పార్క్ లో రూ. 600 కోట్ల పెట్టుబడులతో ఈ 6 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని… మరో 18 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. వచ్చే 6 నుండి 9 నెలల్లో మరిన్ని ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు సీఎం వైయస్ జగన్.