గ్లోవ్స్ ధరించి 20 నిమిషాలు రాయాలని నీట్ పరిక్షలు రాస్తున్న 17 ఏళ్ళ స్వాతి త్రిపాఠి హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కు సవాల్ విసిరారు. పరీక్షా మార్గదర్శకాలను కూడా ఆమె తీవ్ర్ స్థాయిలో విమర్శించారు. దేశంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ఇతరుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే స్వాతీ ఈ సవాల్ చేసారు. మధ్యప్రదేశ్‌కు చెందిన స్వాతి త్రిపాఠి ఒక వీడియోలో హెచ్‌ఆర్‌డి మంత్రితో పాటు ఇతరులతో గ్లోవ్స్ ధరించి రాయాలని సవాలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో గ్లోవ్స్ తో పరీక్షలు రాయడం ఎంత అసౌకర్యంగా ఉందో వివరిస్తుంది. మహమ్మారి పరీక్షలను ఒకటి లేదా రెండు నెలలు వాయిదా వేయాలని, టీకాలు వేయడం ముగిసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఆమె కేంద్రాన్ని కోరారు.