సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు, కీలక అధికారులను టార్గెట్ చేసిన పాక్…?

-

ఇండో- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం మళ్ళీ చోటు చేసుకుంటుందా…? మంచు మాటున అడవుల్లో పాకిస్తాన్ రెచ్చగొట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తుంది. దీనితో అసలు సైనికులు సరిహద్దులలలో పహారా కాయాలి అంటేనే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

దీనిని పాకిస్తాన్ అనువుగా చేసుకునే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలు ఎన్నికలు ఉన్న నేపధ్యంలో సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు గాను పాకిస్తాన్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తుంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఇప్పటికే అప్పుడప్పుడు దిగుతున్న సంగతి తెలిసిందే. ఇక బ్యాట్ దళాలతో ఆ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తుంది.

సరిహద్దు గ్రామాలపై తేలికపాటి ఆయుధాలతో పాక్ ఆర్మీ దాడులు చేస్తుంటే, బ్యాట్ దళాలు సాధారణ పౌరులను కిడ్నాప్ చేసి హతమారుస్తున్నాయి. ఇక సైనికులను కిడ్నాప్ చేయడానికి బ్యాట్ దళాలు భావిస్తున్నాయి. కీలక ప్రాంతాల్లో ఇప్పటికే భారత ఆర్మీ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. అడవులు కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అక్కడి నుంచి ఉగ్రవాదులు చొరబడుతున్నారు.

ఆ ప్రాంతాల్లో గస్తీ కాయడం కూడా ఇబ్బందికరమే. ఇక అక్కడ మంచు కూడా కురవడంతో ప్రత్యర్ధిని గుర్తించడం కష్టంగా మారింది. దీనితో భారీగా మంచుని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడుతున్నారని, భారత ఆర్మీ లక్ష్యంగా, స్థానిక పోలీసులు లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు దిగే అవకాశం ఉందని అంటున్నారు. దీనితో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news