DRDOలో 1901 ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ పలు పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు లోకి వెళితే.. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నీషియన్-A రిక్రూట్‌మెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 23 సెప్టెంబర్ 2022. 03 సెప్టెంబర్ 2022 నుండి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. DRDO CEPTAM రిక్రూట్‌మెంట్ 2022 ద్వారా 1901 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

1075 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ పోస్టులు ఉండగా 826 టెక్నీషియన్-ఏ ఖాళీలున్నాయి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి ఖాళీలకు అయితే AICTE గుర్తింపు పొందిన కళాశాల నుండి సైన్స్ లేదా ఇంజనీరింగ్ ని పూర్తి చెయ్యాలి. లేదంటే టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ కానీ సంబంధిత సబ్జెక్టు లో డిప్లొమాలో బ్యాచిలర్ డిగ్రీని ఉండాలి.

అదే టెక్నీషియన్-A (టెక్-A) పోస్ట్స్ కి అయితే 10వ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు మినిమమ్ ఉండాలి. మాక్సిమం అయితే 28 సంవత్సరాలు. అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news