‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ సినిమా చేయడానికి బాలయ్య పెట్టిన కండీషన్ ఇదే..

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. యాక్షన్ డైరెక్టర్ బి.గోపాల్-బాలయ్య కాంబోలో వచ్చిన ఈ పిక్చర్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. బాలయ్యను ఖాకీ డ్రెస్సులో చూసి అభిమానులు, ప్రేక్షకులు హ్యాపీగా ఫీలయ్యారు. కాగా, ఈ సినిమా షూటింగ్ టైమ్ లో బాలయ్య ఓ వింత కండీషన్ పెట్టారని దర్శకుడు బి.గోపాల్ తెలిపారు.

పోలీస్ డ్రెస్సులో తొలిసారి బాలయ్యను అభిమానులు ఈ సినిమా ద్వారా చూశారు. కాగా, పోలీసుగా కనబడేందుకు బాలయ్య చాలా హోం వర్క్ చేశారు. పోలీసులు ఎలా నడుస్తారు? లాఠీ ఎలా పట్టుకుంటారు? జీపు లో ఎలా కూర్చుంటారు? వంటి విషయాలతో పాటు పోలీసులు ఆహార్యం ఎలా ఉండాలి? అనే విషయాలపైన బాలయ్య కంప్లీట్ రీసెర్చ్ చేశారు.

అలా ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ షూటింట్ టైమ్ మొత్తం బాలయ్య తనను తాను పోలీస్ ఇన్ స్పెక్టర్ గానే ఫీలయ్యారు. అలా షూటింగ్ టైమ్ లో ఓ రోజు బాలయ్య డైరెక్టర్ బి.గోపాల్ కు ఫోన్ చేసి తాను షూటింగ్ కు రావడం లేదని చెప్పారు. ఆ మాటలు విని.. ఎందుకు బాబు? అని బి.గోపాల్ అడిగారు.

అప్పుడు బాలయ్య ఓ కండీషన్ పెట్టారు. ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ ఫిల్మ్ లో తాను వాడుతున్న జీపు ఇంటికి పంపిస్తే అందులోనే షూటింగ్ కు వస్తానని, అప్పుడే తాను పాత్రలోకి సంపూర్ణంగా లీనం కాగలనని చెప్పారు. అప్పుడు ఆ పోలీసు జీపును బాలయ్య ఇంటికి పంపగా, అలా ప్రతీ రోజు షూటింగ్ కు అదే జీపులో వచ్చారని బి.గోపాల్ చెప్పారు.

ఏసీ కారు ఉన్నప్పటికీ పాత్ర కోసం పోలీసు జీపులో వచ్చి షూటింగ్ లో బాలయ్య పాల్గొన్నారని గోపాల్ వివరించారు. విజయశాంతి ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాకు పుష్పానంద్ స్టోరి అందించారు. బాలయ్య-బి.గోపాల్ కాంబోలో ఈ సినిమాకు ముందు వచ్చిన ‘లారీ డ్రైవర్’ సూపర్ హిట్ అయింది. అంతకు మించిన విజయం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ సినిమా సాధించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news