నాలుగు రోజుల్లో 2 లక్షల కేసులు…!

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. గత వారం రోజుల నుంచి ప్రతీ రోజు 50 వేల వరకు కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 57,117 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 764 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా 5,65,103 క్రియాశీల కేసులు ఉన్నాయి.

coronavirus
coronavirus

ఇప్పటి వరకు కరోనా బారిన పడి 10,94,374 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. 36,511 మంది ఇప్పటి వరకు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 16,95,988 మందికి దేశ వ్యాప్తంగా కరోనా సోకింది. దేశంలో కరోనా పరిక్షలు వేగంగా చేస్తున్నారు. జూలై 31 వరకు పరీక్షించిన నమూనాల సంఖ్య 1,93,58,659 కాగా… నిన్న 5,25,689 మందికి కరోనా పరిక్షలు చేసారని… ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. నాలుగు రోజుల్లో 2 లక్షల కేసులు నమోదు అయ్యాయి.