బాబు వయసు, మైండ్ పై అవంతి కామెంట్స్ ఇవి!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య, నాయకుల మధ్య రసవత్తరంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లును ఏపీ గవర్నర్ ఆమోదించడంపై వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరో హైదరాబాద్ వంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా ఎంతో దూరదృష్టితో మూడు రాజధానులను ఏర్పాటు చేసి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న సత్సంకల్పంతో తీసుకున్న నిర్ణయం కీలక దశకు చేరుకుంది. ఆ చారిత్రాత్మక బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో వైఎస్ జగన్ కల నెరవేరింది. వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నట్లుగా వికేంద్రీకరణ దిశగా అడుగులు పడేందుకు మార్గం సుగమం అయింది.

అయితే గవర్నర్ ఆమోద ముద్రపై టీడీపీ అధినేత బెంబేలెత్తిపోయారు. ఒకరకంగా తమ్ముళ్లంతా షాక్ కి గురయ్యారు! తాము ఇక న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై ఉత్తరాంధ్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అసలు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని తెలిపిన ఆయన.. మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడం ఒక చరిత్రాత్మక నిర్ణయంగా అభివ‌ర్ణించారు.

అంతేకాకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జ‌గ‌న్ సంకల్పించార‌ని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. అమరావతి, ఆ చుట్టుపక్కల గ్రామాలకే ప్రతిపక్షనేతలా మాట్లాడటం స‌రికాద‌ని ఘాటైన వ్యాఖ్యలు చేసిన అవంతి… చంద్ర‌బాబు ఎవరిపై న్యాయ పోరాటం చేస్తారు? అని ప్ర‌శ్నాస్త్రాన్ని సంధించారు. ఈ వ‌య‌స్సులో చంద్ర‌బాబుకు అంత ఆవేశం ఎందుకు అంటూ మండిప‌డ్డారు. కాగా ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర మరింతగా అభివృద్ధి చెందుతుందని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసినందుకు, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున అవంతి శ్రీనివవాస్… సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి ఈ దెబ్బతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news