కరోనా పేరుతో 2 వేల కోట్ల స్కామ్.. !?

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ కట్టడి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ తో ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కరోనా సమయంలో కర్ణాటక ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.

కర్ణాటక లో కరోనా వైరస్ విజృంబిస్తున్న సమయంలో… కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప సహా క్యాబినెట్ లోని మంత్రులు అందరూ ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ మండిపడ్డారు సిద్ధరామయ్య. కరోనా పేరు అడ్డు పెట్టుకుని ఏకంగా రెండు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆరోపించారు. హైకోర్టులో దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన సిద్దరామయ్య.. అసెంబ్లీ లో సైతం దీనిపై చర్చ జరగాలని కోరారు. కరోనా  వైరస్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు సీద్దరామయ్య.

Read more RELATED
Recommended to you

Latest news