ఐటి నిపుణులకు 400% పెరిగిన ఉద్యోగవకాశాలు.. బెంగుళురు నుండి అత్యధిక డిమాండ్..!

-

ప్రస్తుతం టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం అంతటా కూడా టెక్నాలజీ కీలక ప్రాధాన్యతనిస్తుంది. దీని కారణంగా ఐటి ఉద్యోగులకు దాదాపు 400 శాతం ఉద్యోగాలు పెరిగాయని సూచిస్తున్నాయి. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం సముచిత నైపుణ్యం ఉన్న వాళ్ళకి డిమాండ్ విపరీతంగా పెరిగింది అని తెలుస్తుంది.

అలానే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, రియాక్ట్ జిఎస్ డెవలపర్స్, ఆండ్రాయిడ్ డెవలపర్ మరియు ఏంగ్యులర్ JS డెవలప్ సహా నైపుణ్యం కలిగిన వాళ్లకి మరింత డిమాండ్ గత త్రైమాసికం నుండి పెరిగింది. గేమింగ్ (యూనిటీ డెవలపర్లు), DevOps (Bamboo, జిరా) మరియు ప్లాట్‌ఫారమ్‌లు (సేల్స్‌ఫోర్స్, SAP HANA) కూడా మంచి డిమాండ్ వుంది.

ఇది ఇలా ఉంటే భారతదేశమంతటా హైరింగ్ యాక్టివిటీ కి సంబంధించి వివరాలు చూస్తే… బెంగళూరు, హైదరాబాద్, పూణే ప్రాంతాలలో ఉన్న ఐటి హబ్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత చెన్నై, ముంబై, NCR మరియు ఇతర ముఖ్యమైన నగరాలు లో డిమాండ్ ఎక్కువగా ఉంది.

బెంగుళూరు లో 40 శాతం డిమాండు ఉంది. అలానే హైదరాబాదులో 18 శాతం, పూణేలో 18 శాతం ఉంది. నైపుణ్యం వారిగా చూసుకున్నట్లయితే… బెంగళూరు క్లౌడ్ టెక్ డవలపర్స్ 41 శాతం, రియాక్ట్ JS డవలపర్స్ 44 శాతం మరియు ఆండ్రాయిడ్ డెవలపర్లకు 81 శాతం అధిక డిమాండ్ ఉందని తెలుస్తోంది.

ఫుల్ స్టాక్ డెవలపర్స్ అయితే బెంగళూరులో 42 శాతం మరియు హైదరాబాద్ లో 37 శాతం డిమాండ్ వుంది. ఇది ఇలా ఉంటే ఏంగ్యులర్ JS డెవలపర్ డిమాండ్ హైదరాబాద్ లో 25 శాతం బెంగళూరులో 21 శాతం గురుగ్రామ్ లో 21% ఉన్నట్లు తెలుస్తోంది. అలానే చెన్నై 16 శాతం, పూణే 13 శాతం ఉంది. కంపెనీ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టం నుండి డేటాని తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news