2 వేల ఏళ్ళ క్రితం చనిపోయిన వారి అస్థిపంజరాల గుర్తింపు…!

పోంపీలో దాదాపు 2,000 సంవత్సరాల క్రితం మరణించిన వారి ఆస్థి పంజరాలను గుర్తించారు. వెసువియస్ పర్వతం విస్ఫోటనం తర్వాత మరణించిన బాధితులను గుర్తించినట్టు ఇటలీలోని పురావస్తు ఉద్యానవన పరిశోధకులు ఆదివారం ప్రకటన చేసారు. క్రీ.శ 79 లో అస్థిపంజర అవశేషాలను గుర్తించారు. ఒక ధనవంతుడు, అతని వద్ద పని చేసే మరో వ్యక్తి అని గుర్తించారు. పాంపీ సరిహద్దుల్లో… ఒక గ్రాండ్ విల్లా శిధిలాలను తవ్వినప్పుడు అస్థిపంజర అవశేషాలు వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.

2017 లో, ఒకే ప్రాంతంలో మూడు గుర్రాల అవశేషాలను గుర్తించారు. దుస్తులు మరియు వారి శారీరక స్వరూపం ఆధారంగా, పరిశోధకులు ఒక యువకుడు మరియు అతని వద్ద పని చేసే వృద్దుడువి అని చెప్పారు. బూడిద పొరలలో… కనీసం 2 మీటర్లు (6.5 అడుగులు) లోతులో ఇవి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. క్రిప్టోపోర్టికస్ అని పిలువబడే భూగర్భ కారిడార్ వెంట ఒక బెడ్ రూమ్ లో గదిలో ఇవి గుర్తించారు.