బ్రేకింగ్ : తెలంగాణా బీజేపీ ఆఫీస్ లో తీవ్ర ఉద్రిక్తత

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోషామహల్ నియోజకవర్గం కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. కుర్చీలు విసిరేసి మరీ కొట్టుకున్నారు కార్యకర్తలు. రాజా సింగ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గన్ ఫౌండ్రి డివిజన్ టికెట్ విషయంలో ఈ ఆందోళన జరుగుతోంది. శైలేందర్ యాదవ్ ఓం ప్రకాష్ వర్గీయుల మధ్య గొడవ జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఓం ప్రకాష్ కు రాష్ట్ర నాయకత్వం టికెట్ ఇచ్చింది.

ఆ బీ ఫార్మ్ తీసుకునేందుకు కార్యాలయానికి వచ్చాడు ఓం ప్రకాష్. దీంతో ఓం ప్రకాష్ ను శైలేందర్ యాదవ్ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఇటీవలే టిడిపి నుండి బిజెపిలో చేరిన ఓం ప్రకాష్ కి టికెట్ ఎలా ఇస్తారు అని ఆందోళనకు దిగారు శైలేందర్ యాదవ్ వర్గీయులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , లక్ష్మణ్ లు కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్యే గా రాజసింగ్ పై కిషన్ రెడ్డి , లక్ష్మణ్ కక్ష కట్టారని గన్ ఫౌండ్రీ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ శైలేందర్ యాదవ్ పేర్కొన్నారు.