గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 20,000 ప్రభుత్వ ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ పరీక్ష-2022కు సంబంధించిన ప్రకటన ఒకటి చేసింది.

ఈ పరీక్ష ద్వారా మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని 20,000 ఖాళీలు వున్నాయి. డిగ్రీ పూర్తి చేసుకున్నవాళ్ళు అప్లై చేసుకోచ్చు. దీని కోసం ఆన్ లైన్ మోడ్ లో దరఖాస్తు చేసుకోవాలి. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఇక పోస్టుల వివరాలు చూస్తే.. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎవోఆర్‌), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఐబీ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎంవోఈఏ), అసిస్టెంట్ సెక్షన్ఆ ఫీసర్(ఏఎఫ్‌హెచ్‌క్యూ) తదితర పోస్టులు వున్నాయి. పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ లో చూడొచ్చు.

డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసినవాళ్లు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-27 ఏళ్లు, 20-30 ఏళ్లు, 18-30 ఏళ్లు, 18-32 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామినేషన్‌, డేటా ఎంట్రీ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తాను. దరఖాస్తుకు చివరి తేది 08.10.2022.

Read more RELATED
Recommended to you

Latest news