చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బీసీ లను గాలికి వదిలేసి ఇప్పుడు బీసీ భజన చేస్తానంటే ఎవరూ నమ్మే పరిస్థితులలో లేరన్నారు. కొడాలి నాని నాని మీడియాతో మాట్లాడుతూ….పవన్ ను వెనకాల పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు టీడీపీకి బీసీలు వెన్నెముక అని ఎలా అంటారని అన్నారు.ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలను కొనసాగించడం తప్ప…చంద్రబాబు బీసీల కోసం కొత్తగా ఏం చేశాడో చెప్పాలని నాని నిలదీశారు. ఓసీలకు ఇవ్వాల్సిన కొన్ని టికెట్లను బీసీలకు టికెట్లు కేటాయిస్తూ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 4 రాజ్యసభ సీట్లు బీసీలకు ఇస్తే 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీ కైనా రాజ్యసభ సీటు ఇచ్చారా అని ప్రశ్నించారు. విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి సీఎం జగన్ బీసీల ఆర్థిక ఉన్నతికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారని కొడాలి నాని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడి మబ్బులన్నీ వీడిపోతాయన్నారు.