22 అడుగుల ఫైనలిపిల్ గణపతి.. ఎక్కడో తెలుసా..?

-

పైనాపిల్ వినాయకుడు విగ్రహం అందర్నీ ఆకట్టుకుంటోంది. దీనిని తిరుపతి జిల్లా తుమ్మలగుంట లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహం గురించి పూర్తి వివరాలని చూస్తే.. ఈ భారీ పైనాపిల్ వినాయకుని ప్రతిమను చేయడానికి 25 మంది కార్మికులు 16 రోజులు పాటు తయారు చేసారు.

మొత్తం ఏడు వేల పైనాపిల్స్‌తో ఈ భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. 22 అడుగులు ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో ఏ గణపతిని చేయడం జరిగింది. ప్రముఖ ఆర్కిటెక్చర్ మురళి దీన్ని తయారు చేసారు. ఈ పైనాపిల్ వినాయకుని విగ్రహం ని చూసేందుకు అధిక సంఖ్య లో భక్తులు వచ్చారు. అలానే 1116 కిలోల లడ్డూ పైనాపిల్ వినాయకుడి ముందు ఏర్పాటు చేసారు.

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్ర గిరి ఎమ్మెల్యే చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి‌లు ఈ పైనాపిల్ విగ్రహం ని ఆవిష్కరించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం పైనాపిల్ వినాయకుని విగ్రహం ని ఏర్పాటు చేసారు. చెరుకు గడల తో మండపం ని ఎంతో అందంగా డెకరేట్ చేసారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news