నిన్న మావోయిస్టులతో నాలుగు గంటల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం 22 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు, 32 మంది గాయపడ్డారు మరియు 30 మంది దాకా జవాన్లు కనిపించడంలేదని అంటున్నారు. ఛత్తీస్‌గడ్ లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులోని అడవిలో ఈ దాడి జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం, ఎన్కౌంటర్ తర్వాత భద్రతా సిబ్బంది నుంచి నక్సల్స్ రెండు డజన్లకు పైగా ఆయుధాలను దోచుకున్నారు.
ఇక భద్రతా సిబ్బంది మరణానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు, వారి శౌర్యం ఎప్పటికీ మరచిపోలేమని అన్నారు. ప్రగతి శత్రువులపై ప్రభుత్వం తన పోరాటాన్ని కొనసాగిస్తుందని షా అన్నారు. గత 10 రోజుల్లో రాష్ట్రంలో జరిగిన రెండవ పెద్ద నక్సల్ సంఘటన ఇది. మార్చి 23న నారాయణపూర్ జిల్లాలో ఐఇడితో భద్రతా సిబ్బందితో వెళుతున్న బస్సును నక్సల్స్ పేల్చి వేయగా ఆ ఘటనలో ఐదుగురు డిఆర్జి సిబ్బంది మరణించారు.