ఆ 25 మంది ఎమ్మెల్యేలు యడియూరప్ప కుర్చీకి ఎసరు పెడతారా..?

-

ఇటీవల కర్ణాటక సీఎం యడియూరప్ప ఇచ్చిన విందు భోజనానికి సొంత ఎమ్మెల్యే రాకపోవడం, పలు అనుమానాలకు దారి తీస్తోంది. బెంగళూరులో తన అధికారిక నివాసం కావేరిలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేసి ‘తప్పకుండా’హాజరవ్వాలని కోరినా 25 మంది ఎమ్మెల్యేలు రాకపోవడంతో పార్టీలో చర్చానీయంశంగా మారింది. ఇటీవల చోటు చేసుకున్న పలు ఘటనలు వారిని నిరాశ పరిచినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుల్లో నిరాశ చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడగట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమని కాదని, పార్టీలోకి వలస వచ్చిన వారికి మంచి పదవులు కేటాయించడంతో అసంతృప్తి చెందినట్లు సమాచారం. దీంతో అసంతృప్తులను బుజ్జగించేందుకే సీఎం విందు భోజనం ఏర్పాటు చేశారు.

రహాస్య మంతనాలు..

అయితే కొంత కాలంగా సీఎం యడ్డీకి వ్యతిరేకంగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు రçహాస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వలస వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్పను కుర్చీ నుంచి తప్పించి మరో నేతను ఎక్కించేందుకు çకసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ఆహ్వానించిన విందు భోజనానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం అనుమానం మరింత బలపడుతోంది.

విందుకు రాని ఎమ్మెల్యేలు వీరే..

సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించడంతో కీలకపాత్ర పోషించిన యడ్డీకి ఇటీవల çపలు సమస్యలు తలనొప్పిగా మారుతున్నాయి. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన నేతలకు ముఖ్యమైన మంత్రి పదవులు అప్పగించడం సొంత క్యాడర్‌కు నచ్చలేదు. సంవత్సరాల తరబడి పార్టీకి సేవ చేస్తుంటే ఇప్పుడిప్పుడే పార్టీలో చేరిన వారికి పదవులు కేటాయిండంతో అసంతృప్తి నెలకొంది.రెబెల్‌ సీనియర్‌ ఎమ్మెల్యేలు బసవన్న గౌడ పాటిల్‌ యత్నాళ్, సునీల్‌ కుమార్‌తో పాటు 25 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు సమాచారం. వీరిలో అరవింద బెల్లద్, పూర్ణిమా శ్రీనివాస్, మహంతేశ్‌ దొడ్డనగౌడ పాటిల్‌తో పాటు మరి కొందరు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news