చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయా జిల్లాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వాటిని పెండింగ్ లో పెట్టాలని ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో పెండింగులో పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఏకగ్రీవాలను పెండింగ్ లో పెట్టాలని ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.
ఇక ముందు నుండీ కూడా నిమ్మగడ్డ ఈ ఏకగ్రీవాల విషయంలో అంత సుముఖంగా లేరు. ఎందుకో కానీ ప్రభుత్వం బలవంతపు ఏకాగ్రీవాలు జరుపుతుంది అనేలాగానే ఆయన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఇక ఖచ్చితంగా దీని మీద అధికార పార్టీ గట్టి కౌంటర్ ఇస్తుందని అనడంలో ఎలాన్తిసందేహం లేదు.