ఈ – కామర్స్ లలో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అమెజన్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరగుతున్నాయి. తాజాగా మరొ సారి అమెజన్ లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చిన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.
ఇది కూడా అమెజన్ అనే ఈ – కామర్స్ లోనే జరిగింది. వివరాలలో కి వెళ్తే కేరళ లోని వయనాడు కు చెందిన మిథున్ బాబు అనే వ్యక్తి ఈ – కామర్స్ అయిన అమెజన్ నుంచి ఈ ఏడాది అక్టొబర్ 1 పాస్ పోర్ట్ కు కవర్ ఆర్డర్ చేశాడు. అయితే నవంబర్ 1 న మిథున్ బాబు కు అమెజన్ ఆ వస్తువు ను డెలివరీ చేసింది. అయితే మథున్ బాబు ప్యాక్ ను తెరిచి చూస్తే షాక్ అయ్యాడు. ఆ ప్యాక్ లో పాస్ పోర్ట కు బదుల ఏకంగా ఒక ఒరిజనల్ పాస్ పోర్టే వచ్చింది.
అయితే ఆ పాస్ పోర్టు కూడా కేరళ రాష్ట్రం లోని త్రిస్సూర్ కు చెందిన మహ్మద్ సాలిహ్ అనే వ్యక్తిగా మథున్ బాబు గుర్తించాడు. అయితే ఈ విషయాన్ని వెంటనే అమెజన్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి చెప్పాడు. అయితే దాని గురించి విన్న కస్టమర్ కేర్ వాళ్లు ముందు షాక్ అయినా.. తర్వాత మళ్లి ఇలాంటి సమస్య రాదని తెలిపారు. అయితే ఈ విషయాన్ని మిథున్ బాబు సోషల్ మీడియా లో పెట్టాడు. అయితే ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.