అసలు ఈ రోజుల్లో పిల్లలను ఎందుకు కంటున్నారో…? అసలు ఎందుకు చంపెస్తున్నారో…? ఎందుకు వదిలేస్తున్నారో…? ఎవడు కనమంటే కంటున్నారు…? ఎవడు చంపమంటే చంపేస్తున్నారు…? కానీ రోడ్డు మీద వదిలేస్తున్నారు. చంపేస్తున్నారు… నవ భారత, ఆధునిక ప్రపంచం చెత్త కుప్పలో, పాడుబడ్డ బావుల్లో కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతుంది.
అవును ఎం జరుగుతుందో అర్ధం కావడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన చూస్తే భయం వేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆందోళన కలుగుతుంది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లాలోని మహీక్-తేబాచాడా గ్రామాల మధ్య బహిరంగ ప్రదేశంలో యువకులు కొందరు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు. ఈ లోపు ఒక పసికందు ఏడుపు వినిపించింది వాళ్లకు. ఇక్కడ ఎవరు ఉన్నారు అని చూసారు వాళ్ళు.
వెంటనే పసికందును ఓ కుక్క నోట కరచుకొని తీసుకువెళ్లడాన్ని గమనించారు వాళ్ళు. వెంటనే రాళ్ళు రువ్వడంతో ఆ కుక్క ఆ బాలికను వదిలేసింది. వెంటనే జాగ్రత్తగా బాలికను తీసుకున్నారు. శరీరంపై 20 కత్తిపోట్లు పొడిచారు. రక్తం కారుతుంది. వెంటనే క్రికెట్ బ్యాట్ పడేసి బాలికను బండి మీద ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. ఊపిరి ఆడకుండా నోట్లో మట్టిపెట్టారు. డాక్టర్లు ఆ మట్టి తీసి బాలికకు వైద్యం చేసారు.
వైద్యం మొదలుపెట్టారు… బాలిక మీద ఉన్న కత్తి గాట్లకు వైద్యం చేసారు. 20 కత్తి పోట్లకు జాగ్రత్తగా ఇంజెక్షన్ ఇస్తూ వైద్యం చేసారు. వెంటనే యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 20 కత్తిపోట్లు పొడిచినా సరే బాలిక బతకడం చూసి పోలీసులు, వైద్యులు ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న యువకులను అడిగారు. అసలు విషయం చెప్పారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.