మానేరు వాగులో చిక్కుకున్న ముగ్గురు.. NDRF స్పెషల్ ఆపరేషన్ !

-

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లుర్ గ్రామ సమీపంలోని మానేరు వాగులో చేపలు పడుతుండగా వరద ఉదృతికి ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. అయితే వాగులో చెట్టును పట్టుకొని సురక్షితంగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. వాగులో నుండి వారిని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడే మానేరు వాగు వద్దకు చేరుకున్న NDRF బృందాలు, వాగులో గల్లంతైన ముగ్గురిలో ఒకరిని సురక్షితంగా బయటకు తీసినట్టు సమాచారం. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

రాత్రికి మరింత వరద పెరిగితే ఇబ్బందులు వస్తాయని గ్రహించిన అధికారులు ఇప్పుడే బయటకు తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి వాగులో ఒక చెట్టు వద్ద మిగతా ఇద్దరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకొని జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమాచారం అందించినట్టు చెబుతున్నారు. దీంతో లోవర్ మానేరు డ్యామ్ నుంచి తెరిచినా ఎనిమిది గేట్లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు మూసివేసినట్టు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news