మన దేశంలో యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎలా అయితే గత ఏడాది మామూలు కరోనా కేసులు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయో అలానే ఇప్పుడు కొత్తగా ఈ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో నాలుగు కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తంగా కొత్త కరోనా కేసుల సంఖ్య 29కి పెరిగింది. కొత్తగా నమోదైన ఈ నాలుగు కేసుల్లో మూడు తెలుగు రాష్ట్రాల నుండే వచ్చినట్టు చెబుతున్నారు.
ఒకటి బెంగళూరులో వచ్చినట్టు సమాచారం.ఇక మరో పక్క ఢిల్లీలో కోవాక్సిన్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌పై చర్చిస్తున్నారు సభ్యులు. కరోనా న్యూ స్ట్రెయిన్‌పై.. ఈ వ్యాక్సిన్లు పనిచేస్తాయా? అనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ కొత్త స్ట్రెయిన్‌ను సైతం ఎదుర్కొనే సత్తా..ఆస్ట్రాజెనికా టీకా ఉందని.. ఆ సంస్థ ప్రకటించింది. త్వరలోనే ఉత్పత్తికి సిద్ధమవుతున్న ఆస్ట్రాజెనికా టీకా.. సాధారణ ధరల్లోనే అందుబాటులో ఉంటుందని చెబుతోంది.