తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోన్ కావడంతో 4,317 ఎకరాల వరి పంట దెబ్బతింది. సుమారు 1.06 లక్షల ఎకరాల్లో నాట్లు వేసిన పంట ముంపునకు గురి అయింది.
మొక్కజొన్న, పత్తి లాంటి పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి.అల్లూరి జిల్లాలోనూ కొన్ని చోట్ల వరద ప్రభావం ఉంది.ఇప్పటికీ తూర్పు గోదావరిలో 273 ఎకరాల పంట నీటమునిగి ఉంది. ఇళ్లు నీట మునిగిన వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉన్న కుటుంబాలకు 3 వేల చొప్పున ఆర్ధిక సాయం అందజేయనుంది.25 కేజీల బియ్యం, కందిపప్పు,లీటర్ పామాయిల్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు కేజీ చొప్పున సాయం అందించనుంది.వ్యవసాయ శాఖ, హోంశాఖ మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి వరద బాధితుల్ని పరామర్శించాలి అని సీఎం చంద్రబాబు సూచించారు.ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశం కారణంగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లలేక పోతున్నాను అని పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలి అని ఆదేశించారు.