మూడేళ్ళ బాలిక ని రేప్ చేసిన మైనర్లు

ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ (ఎస్‌జిఎన్‌పి) లో మూడేళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు సోమవారం అత్యాచారం చేశారు. బోరివ్లిలో ఉన్న ఈ నేషనల్ పార్క్ లోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 14 – 15 సంవత్సరాల వయస్సు గల నిందితులు తన ఇంటి బయట ఆడుకుంటున్న బాలికకు మాయ మాటలు చెప్పి ఆమెను ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె మీద అత్యాచారం చేశారు. 

ఈ సంఘటన తరువాత, ఆమె నొప్పితో ఏడుస్తున్న క్రమంలో ఆమె తల్లిదండ్రులు ఆరా తీసినప్పుడు, ఆమె ఈ సంఘటన గురించి వెల్లడించింది. బాలిక తల్లిదండ్రులు కస్తూర్బా మార్గ్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి నిందితుల మీద ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి సంబందించిన కేసులతో పాటు నిందితులపై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఇక వారిని అరెస్టు చేసి జువైనల్ హోంకి పంపారుని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.