ఏపీకి రానున్న 30 ఈఎస్ఐ ఆస్పత్రులు : కేంద్రమంత్రి పెమ్మసాని

-

ఏపీకి కేంద్ర ప్రభుత్వం 30 ఈఎస్‌ఐ ఆస్పత్రులను మంజూరు చేసిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. భూమి కేటాయింపు పూర్తైన వెంటనే వీటి నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. అమరావతిలో రూ.250 కోట్లతో 400 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి రాబోతోందని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సుమారు వంద నిర్మాణాలు జరగాల్సి ఉందని, ఆయా శాఖలతో సంప్రదించి పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు. కూటమి ప్రభుత్వం పవర్‌లోకి రాగానే గుంటూరు ప్రభుత్వాస్పత్రి డెవలప్‌మెంట్ కోసం వేగంగా చర్యలు తీసుకున్నామన్నారు.

అదేవిధంగా జీజీహెచ్ అభివృద్ధికి 60 అంశాలతో కూడిన అజెండాపై అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. రక్త పరీక్షలన్నీ ఆస్పత్రిలోనే నిర్వహించి, జీజీహెచ్‌లో పేదలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. ‘పారిశ్రామికవేత్త రామచంద్ర తులసి రామచంద్ర ప్రభు రూ.4 కోట్లతో సర్వీస్ బ్లాక్, పొదిలి ప్రసాద్ మరో భవనం, నాట్కో వారు మరో భవన నిర్మాణానికి ముందుకొచ్చారని గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news