మాజీ మంత్రికి తిరిగి కేబినెట్‌లో చోటిచ్చిన సీఎం స్టాలిన్

-

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన ఉప ముఖ్యమంత్రిగా నియమితులవ్వగా..సీఎం సిఫారసులకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆమోదం తెలిపారు.తాజాగా స్టాలిన్ మంత్రి మండలిలోకి వి.సెంథిల్ బాలాజీ , గోవి చెజియాన్, ఆర్ రాజేంద్రన్, ఎస్ఎం నాసర్‌లు చేరారు. వీరి చేరికను కూడా
గవర్నర్ ఆమోదించారు.

కాగా, మొన్నటివరకు మంత్రులుగా ఉన్న టి మనో తంగరాజ్ (పాలు, పాడిపరిశ్రమ అభివృద్ధి),గింజీ కెఎస్ మస్తాన్ (మైనారిటీల సంక్షేమం,ప్రవాస తమిళుల సంక్షేమం), కె రామచంద్రన్ (పర్యాటకం)లకు సీఎం స్టాలిన్ ఉద్వాసన పలికారు. ఇకపోతే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై మనీలాండరింగ్ ఆరోపణల కారణంగా 15 రోజుల పాటు ఈడీ జైలులో ఉంచిన విషయం తెలిసిందే.తాజాగా ఆయనకు బెయిల్ రాగా, సీఎం స్టాలిన్ ఆయన్ను తిరిగి కేబినెట్లోకి తీసుకున్నారు. కొత్తగా మంత్రులు ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news