కొత్త ఫోను కొనాలనే ఆలోచన వచ్చినప్పుడు బుర్రలోకి చాలా ఫోన్లు వస్తాయి. రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. దీంతో ఏ ఫోన్ కొనుగోలు చేయాలో తెలియక యూజర్లు తికమక పడే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ మన బడ్డెట్ కి దగ్గరలో ఏది ఉందో అదే మనం చూసుకుంటాం. కొందరైతే..తమ ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడుగుతుంటారు. అయితే 30 వేల లోపు ఫోను కొనాలనుకునే వాళ్లకు బెస్ట్ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Realme X7 Pro: ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 1080*2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 6.55 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమినిస్టీ 1000+ ఆక్టా కోర్ ప్రాపెసర్‌ను ఇచ్చారు. 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 31 ఎంపీ సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ ఫోన్ ధర (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) రూ. 29,999గా ఉంది.
Motorola Edge 20: ఈ ఫోన్‌లో 1080*2400 పిక్సెల్‌తో కూడిన 6.70 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. దీంతో పాటు ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఈ ఫోన్ సొంతం. 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించిన ఈ ఫోన్ ధర రూ. 29,999గా ఉంది.
OnePlus Nord 2 5G: వన్‌ప్లస్ నుంచి వచ్చిన బడ్జెట్ ఫోన్స్‌లో ఇది ఒకటి. ఇందులో 1080*2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 6.43 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్ట్సీ 1200 ప్రాసెసర్ ఉంది. 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్న ఈ ఫోన్ ధర రూ. 27,999 (6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్).
Poco F3 GT: ఈ స్మార్ట్ ఫోన్‌లో 1080*2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే.. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్ట్సీ 1200ను ఇచ్చారు. 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించి ఈ ఫోన్ ధర రూ. 26,999గా ఉంది.
OnePlus Nord CE: 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ ధర 24,999. ఈ ఫోన్‌లో 1080*2400 పిక్సెల్ రిజల్యూషన్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.