“క్యాలీ ఫ్లవర్” ట్రైలర్‌ రిలీజ్ : శీలన్నీ కాపాడేందుకు వచ్చేసిన బర్నింగ్ స్టార్

-

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నాడు బర్నింగ్ స్టార్. సంపూర్ణేష్ బాబు సినిమాలంటే చాలా వెరైటీ, వినోదభరితమైన కథాంశంతో తెరకెక్కుతుంటాయి. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు క్యాలీ ఫ్లవర్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ రాధా కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మూవీ మేక‌ర్స్. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి జంటగా నటిస్తోంది. ఈ సినిమాకు ప్రజ్వల్ క్రిష్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. తాజాగా క్యాలీఫ్లవర్ సినిమా ట్రైలర్ విడుదలైంది.

” ఎక్కడ చూసినా కాలీఫ్లవర్ గురించి చర్చ.. “పార్లమెంట్ సాక్షిగా సభ పెట్టారు ఈ కాలీఫ్లవర్.”… ” వీడెవడో ఒక్కరోజులోనే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు ” అనే డైలాగ్ లతో ప్రారంభమైన ట్రైలర్… అందరినీ కడుపుబ్బ నవ్వించేలా చేసింది. ఈ సినిమా పూర్తిగా కామెడీ కథాంశంతో ఉన్నట్లు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తే. ఇది ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news