ఒక పక్క జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత బలగాలు చుక్కలు చూపిస్తున్నా సరే ఉగ్రవాదులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా భారత్ లోకి నియంత్రణ రేఖ వద్ద రావడానికి ప్రయత్నాలు చేస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఈ నేపధ్యంలో రక్షణ ప్రతినిధి కల్నల్ రాజేష్ కలియా కీలక వ్యాఖ్యలు చేసారు. భారతదేశంలోకి చొరబడటానికి సరిహద్దు మీదుగా ఉన్న లాంచ్‌ప్యాడ్ల వద్ద 250-300 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
లాంచ్ ప్యాడ్ లు ఇప్పుడు పూర్తిగా ఉగ్రవాదులతో నిండి ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. తాము ఊహించిన విధంగా అయితే దాదాపు 300 మంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో ఉన్నారు అని అయన పేర్కొన్నారు. దీనితో భారత బలగాలు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసాయి. ఏ మాత్రం కూడా తాము ఉపేక్షించేది లేదు అని ఆయన స్పష్టం చేసారు.