ఏపీలో కరోనా కలకలం.. రికార్డు స్థాయిలో కేసులు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా.. 1,813 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 311 కేసులు గుర్తించారు.

చిత్తూరు జిల్లాలో 300, కర్నూలు జిల్లాలో 229, శ్రీకాకుళం జిల్లాలో 204 కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 1,168 మందిని డిశ్చార్జి చేశారు. దాంతో ఇప్పటివరకు కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,393కి పెరిగింది. ఓవరాల్ గా 27,235 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇంకా 12,533 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే ఇవాళ ఒక్కరోజులో 17 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 309కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news