ఈ వారం చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ మూడో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,195 మంది అభ్యర్థులలో 31 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ప్రకటించారని పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. 282 మంది… అంటే 24 శాతం మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఐదేళ్ల జైలు శిక్ష పడే నాన్-బెయిలబుల్ నేరాలు అని నివేదిక తెలిపింది.
ఈ అభ్యర్థులలో 361 మంది అంటే… 30 శాతం మంది తమ కోటీశ్వరులుగా ప్రకటించారు. విశ్లేషించిన 1,195 మంది అభ్యర్థులలో 371 లేదా 31 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. నివేదిక ప్రకారం, ఆర్జెడి నుండి పోటీ చేస్తున్న 44 మంది అభ్యర్థులలో 32 (73 శాతం) తమపై క్రిమినల్ కేసులను ప్రకటించారు. వారిలో 22 (50 శాతం) తమ అఫిడవిట్లలో తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. బిజెపి నుండి 34 మంది అభ్యర్థులు 26 (76 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు ప్రకటించారని పేర్కొంది.