ఏపీలో హెరిటేజ్ vs అమూల్..మూడు జిల్లాల్లో విస్తరణ…!

-

ప్రఖ్యాత డెయిరీ సంస్థ అమూల్ ఇక ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనుంది. ఈ నెల 25 నుంచి మూడు జిల్లాల్లో పాలసేకరణ కార్యకలాపాలు ప్రారంభించనుంది. గత కొంత కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం జరుపుతూ వచ్చిన చర్చలు ఫలించి కార్యరూపం దాల్చనున్నాయి. గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన ప్రఖ్యాత డెయిరీ సంస్థ ఆనంద్ డెయిరీ-అమూల్ ఏపీలో తన కార్యకలాపాలు ప్రారంభించటానికి సన్నాహాలు చేసుకుంటోంది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమూల్ తో చర్చలు ప్రారంభించింది. పాలసేకరణ, పాల ఉత్పత్తుల అమ్మకాలకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అమూల్ తో కలిసి కార్యాచరణ రూపోందిస్తోంది. ఈ నెల 25 నుంచి అమూల్ ఆధ్వర్యంలో పాల సేకరణ ప్రారంభం కానున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో చేడతారు. తర్వాత ఇతర జిల్లాల్లోనూ విస్తరిస్తారు.

పాల ఉత్పత్తిలోనూ హెరిటేజ్ వంటి ప్రైవేటు సంస్ధలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం, ఏపీ డెయిరీ కార్పోరేషన్ వేస్తున్న వ్యూహాత్మక అడుగు ఇది. అమూల్‌ కార్యక్రమాల్లో వేగం పెంచటానికి జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో కోర్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. మహిళా పాల ఉత్పత్తిదారులతో ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేయటం, రైతులకు వైఎస్సార్‌ చేయూత పథకం కింద పాడిపశువుల కొనే విధంగా ప్రోత్సాహించటం, సిబ్బందికి శిక్షణ ఇవ్వటం వంటి కార్యక్రమాలను ఈ కోర్‌ కమిటీలు పర్యవేక్షించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news