ఒక మహిళ కోసం 31 మంది సైనికులు పోటీ పడి 11 మంది చనిపోయారు…!

-

అది 1944. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా మూడు జపాన్ నౌకలపై అమెరికా వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. దీనితో జపాన్ కి చెందిన కీలక నౌకలు అన్ని మునిగిపోగా వాటిల్లో ఉన్న జవాన్లు అందరూ చనిపోగా కేవలం 31 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారందరూ ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని అనతహన్‌ దీవికి చేరుకొని తమ ప్రాణాలను రక్షించుకున్నారు.

కేవలం 13 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన దీవిలో వాళ్ళు దాదాపు 7 ఏళ్ళ పాటు బ్రతుకు జీవుడా అంటూ ఉన్నారు. 1945 లోనే ప్రపంచ యుద్ధం ముగిసినా సరే వాళ్ళు మాత్రం యుద్ధం ముగియలేదని భావించారు. అయితే, ఇక్కడే ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ దీవిలో షోయిచి హిగ అనే వ్యక్తి, అతని భార్య కజుకొతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.

యుద్ధం జరుగుతున్న సమయంలో తన సోదరిని చూడటానికి గాను, వెళ్ళాడు. కాని అతను ఎప్పటికి అక్కడి నుంచి తిరిగి రాలేదు. భర్త కోసం ఎంతగానో ఎదురు చూసిన ఆ భార్య… యజమాని కికైచిరో కజుకొను వివాహం చేసుకుంది. సరిగా ఇదే సమయంలో 31 మంది జపాన్ సైనికులు అక్కడికి రావడంతో వారికి దంపతులు ఆశ్రయం ఇచ్చారు. 1946లో ఆమె భర్త కికైచిరో కన్నుమూశాడు.

దీనితో ఆ దీవి మొతానికి ఆమె యజమాని అయింది. దీనితో ఆ సామ్రాజ్యానికి తాము అధిపతి కావాలనుకుని భావించిన 31 మంది సైనికులు కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలని చూసారు. ఆమె కోసం వారిలో వారే గొడవలు పడ్డారు. దీనితో వారికి నేతృత్వం వహిస్తున్న కెప్టెన్‌ ఇసిద ఆమెను ఒక సైనికుడికి ఇచ్చి వివాహం జరిపించగా అతన్ని కొన్ని రోజులకే చంపేశారు.

అలా ఆమె వివాహం చేసుకున్న నలుగురు కూడా దారుణ హత్యకు గురయ్యారు. ఐదేళ్లలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో మిగిలిన 20 మంది సైనికులు కూడా ఆమెను చంపకపోతే అందరూ చనిపోయే అవకాశం ఉందని భావించి ప్లాన్ చేసారు. ఆమె విషయాన్ని ముందే పసిగట్టి తీరం చేరుకోవడంతో అక్కడ గస్తీలో ఉన్న అమెరికా సైనికులు ఆమెను రక్షించారు.

తన సొంత పట్టణమైన ఒకినావాకు ఆమె చేరుకోగా ఆమె భర్త తారసపడ్డాడు. తన భర్త కూడా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీనితో ఇక అప్పటి నుంచి ఆమె ఎవరిని వివాహం చేసుకోలేదు. తరువాత ఒంటరిగా జీవనం సాగించి 1970లో తుది శ్వాస విడిచింది.

Read more RELATED
Recommended to you

Latest news