హైదరాబాద్‌లో ఇవాళ ఏకంగా 32 బస్తీ దవాఖానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిచింది. బాలా నగర్‌లో మంత్రి హరీష్‌రావు.. షేక్‌పేటలో బస్తీ మంత్రి కేటీఆర్.. దూల్‌పేటలో బస్తీ దవాఖానాలను ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం బస్తీ దవాఖానాల ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకెళ్లాలనే ఆలోచనతో బస్తీ దవాఖానా ల ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి తలసాని. GHMC పరిధిలో ఇప్పటికే 226 బస్తీ దవాఖానా ల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఈ రోజు నూతనంగా 32 బస్తీ దవాఖానా లను ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు మంత్రి తలసాని. ఉచితంగా వైద్య సేవలు, మందులు అందిస్తున్న బస్తీ దవాఖానా లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. కెసిఆర్ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. టిఆర్ఎస్ ప్రభుత్వం.. ఎప్పుడూ ప్రజల మీరు మాత్రమే కోరుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు.