మీరు జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల లో ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. సుమారు 38 వేలకు పైగా ఖాళీలతో ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు. వచ్చే మూడేళ్లలో 740 స్కూళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం చూస్తోంది. అర్హులైన అభ్యర్ధులు నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ కి అప్లై చెయ్యచ్చు. నెలకు రూ. 18,000 నుంచి రూ.2,09,200 వరకు జీతం ఇస్తారు.
ఇక పోస్టుల వివరాలు చూస్తే.. ప్రిన్సిపల్ పోస్టులు 740 వున్నాయి. మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ కలిగి ఉంటే ఈ పోస్టుల కోసం అప్లై చెయ్యవచ్చు. అలానే అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 50 ఏళ్ళు దాటకూడదు. వైస్ ప్రిన్సిపల్ పోస్టులు 740 వున్నాయి. పీజీటీగా సర్వీస్ లో వర్క్ చేస్తూ ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) పోస్టులు 8,140 వున్నాయి. మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి. వయస్సు 40 ఏళ్లకు మించకూడదు.
అలానే పీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్టులు 740, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టులు 8,880 వున్నాయి. ఆర్ట్ టీచర్ పోస్టులు 740, మ్యూజిక్ టీచర్ పోస్టులు కూడా 740 వున్నాయి. అలానే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) పోస్టులు 1,480, లైబ్రేరియన్ పోస్టులు 740 వున్నాయి. స్టాఫ్ నర్సు పోస్టులు కూడా 740 వున్నాయి. హాస్టల్ వార్డెన్ పోస్టులు 1,480 వున్నాయి. ఇదిలా ఉంటే అకౌంటెంట్ పోస్టులు 740, క్యాటరింగ్ అసిస్టెంట్ పోస్టులు 740 వున్నాయి. చౌకీదార్ పోస్టులు 1480 వున్నాయి. వీటితో పాటు కుక్ పోస్టులు, హెల్పర్ పోస్టులు, కౌన్సిలర్ పోస్టులు కూడా వున్నాయి. అధికారిక వెబ్ సైట్ లో అర్హత వివరాలు చూసుకోవచ్చు.
నోటిఫికేషన్ లింక్: https://telugu.samayam.com/photo/100785309.cms