బేబీ బుంప్ తో ఇలియానా హాట్ సెల్ఫీ..!!

-

టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. ఆ స్టార్ డం తోనే బాలీవుడ్లోకి వెళ్లి ఫెయిల్యూర్ హీరోయిన్గా మిగిలిపోయింది. అవకాశాలు తగ్గ ముఖం పట్టడంతో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇలియానా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు తెలియజేసే అందరికీ షాక్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా బేబీ బంప్స్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది ఇలియానా.

అయితే ఇప్పటివరకు తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. తాజాగా ఇప్పుడు మరొకసారి ఇలియానా బీచ్ లో కనిపించింది.. ఎల్లో బికినీ ధరించి బీచ్ లో రిలాక్స్ అవుతున్నట్టు ఒక కూలింగ్ గ్లాస్ ధరించి మతులు పోగొట్టే సెల్ఫీ ఫోటోలను షేర్ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇందులో క్లోజ్ గా తన ఎద అందాలను చూపిస్తూ సెల్ఫీ తీసుకోవడమే ఇప్పుడు అందరిని ఆశ్చర్యాన్ని కలిగించేలా చేస్తోంది. ఇలియానా బేబీ బంప్ తోపాటు క్లోజ్ గా తన అందాలను సైతం చూపిస్తూ నేటిజన్లకు సైతం మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా చేస్తోంది.

ఇలియానా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. గతంలో స్లిమ్ముగా నాజూకుగా సన్నని నడుముతో కనిపించిన ఇలియానా ఆ తరువాత కాస్త బొద్దుగా మారడం జరిగింది. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్ కారణంగా మరింత బొద్దుగా కనిపిస్తోంది ఇలియానా. ఇలియానా ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన తను గర్భవతి అంటూ ప్రకటించింది. పెళ్లి కాకుండా ఇలియానా గర్భవతి కావడంతో ఈమె పైన పలువురు నెటిజన్ల సైతం ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే తన పొట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ గా పెట్టింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news