చెన్నైలో ఆన్ లైన్ మనీ యాప్ ముఠా అరెస్ట్ చేశారు. నలుగురు చైనా యువకులతో పాటు మరి కొందరిని అరెస్ట్ చేశారు. M రూపీ పేరుతొ యాప్ నడపుతోంది. ఐదు వేల లోన్ మూడు వేల ఐదు వందల ఇస్తున్నారు యాప్ నిర్వాహకులు. వడ్డీ కట్టకపోతే వస్తువులను జప్తు చేస్తోంది ముఠా. స్థానికుల ఫిర్యాదుతో చైనా ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇక చైనాకు చెందిన లాంబోను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చైనాకు పారిపోయేందుకు యత్నించిన లాంబోను ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. 4 కంపెనీల ద్వారా లోన్ యాప్స్ నడుపుతున్న లాంబో,అలానే లాంబోకు పూర్తిస్థాయిలో సహకరించిన నాగరాజు అరెస్ట్ అయ్యారు. 6 నెలల కాలంలో రూ.21 వేల కోట్ల లావాదేవీలు మొత్తం 150 యాప్స్ ద్వారా లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు.