ఆ కుక్కకు 2 ఎకరాల భూమి ఉంది తెలుసా..!

-

కుక్కకు ఉన్న విశ్వాసం లేదా నీకు.. అనే పదాలు మన పెద్దవాళ్లు అప్పుడప్పుడు అంటుంటారు. మనుషులకీ కుక్కలంటే చాలా ఇష్టం. కొందరైతే తమ పిల్లలను పెంచినట్లు పోషిస్తుంటారు. కానీ.. ఓ రైతు మాత్రం తన కొడుకులకు చెందాల్సిన ఆస్తిని తాను పెంచుకున్న పెంపుడు కుక్కపై చేసి ఆ రాష్ట్రాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని చింద్వార జిల్లా బరిబడా గ్రామానికి చెందిన ఓం నారాయణ్‌ అనే ఓ రైతు, భార్య తన ఐదుగురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఆ కుటుంబానికి జాకీ అనే ఓ పెంపుడు కుక్క ఉంది. ఆయనకు దాదాపుగా 18 ఏకరాల పొలం ఉంది. తన కుమారుల ప్రవర్తన నచ్చక నారాయణ్‌ వారి తీరు మార్చుకోవాలని పదేపదే హెæచ్చరించారు. అయినా వారిలో ఏలాంటి మార్పు లేకపోవడంతో ఓ నిర్ణయానికి వచ్చారు.

తన మరణం తర్వాత ఎంతో జాగ్రత్తగా చూసుకున్న భార్య చంపా, తనకు రక్షణగా ఉన్న పెంపుడు కుక్క జాకీలకు ఎలాంటి ఆధారం లేకుండా ఉండరాని భావించాడు. వెంటనే తనకున్న 18 ఏకరాల భూమిలో 16 ఎకరాలు భార్య చంపా, మిగిలిన రెండెకరాలు జాకీపై రిజిస్ట్రేషన్‌ చేశాడు. దీంతో నారాయణ్‌ రైతు వారసుడిగా జాకి మారింది.’నా భార్య చంపా, మరియు జాకీ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కనుక నేను బతికున్నప్పుడే వీరిద్దరికి ఏమన్న చేయాలనుకున్నా. అందుకే నా మరణంతరం నా ఆస్తికి భార్య చంపా, జాకీలే అర్హులు. దీంతో ఎవరైతే జాకీ ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకుంటారో వారే జాకీ ఆస్తి తదుపరి వారసులుగా ఉంటారన్నారు. తన కుమారులు ఏనాడు నన్ను బాగా చూసుకోలేదు. దీంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు రైతు నారయణ్‌ ఆస్తి వీలునామాలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news