ఇంట్లో బల్లి ఈ ప్లేసుల్లో కనిపిస్తే ధనం, ఆనందానికి చిహ్నమట..!

-

బల్లి కనిపిస్తేనే చాలు అమ్మాయిలు తెగ భయపడిపోతారు..కొందరి ఇళ్లలో బల్లులు కూడా ఎక్కువగానే ఉంటాయి. బల్లిమీద పడితే పడిన భాగాన్ని పట్టి రకరకాలుగా చెప్తుంటారు పండితులు. ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో బలి కనిపించటం శుభప్రదమట. ఆలయంలో లేదా పూజ గదిలో బల్లులు కనిపించడం చాలా మంచికి సంకేతం. ఈ జీవి రూపం ధన లాభమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను కూడా పెంచుతుందట. ఈరోజు బల్లి శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకుందాం..

ఏ రోజు బల్లిని చూడటం శుభప్రదం

దీపావళి రోజు రాత్రి ఇంట్లో బల్లి కనిపిస్తే అది చాలా శుభసూచకం. నిజానికి బల్లి లక్ష్మిదేవికి సంకేతం. దీపావళి రోజున బల్లి ఇంటికి రావడం లేదా కనిపించడం ఇంట్లో లక్ష్మి రాకను సూచిస్తుందని బల్లి శాస్త్రం చెబుతుంది.

కలలో బల్లిని కనబడటం

మీరు కలలో బల్లిని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ.. అది భయంతో పారిపోతుంటే అది మంచికి సంకేతం. మీరు త్వరలో శుభవార్త అందుకోబోతున్నారని అర్థమట.

కొత్త ఇంట్లో బల్లి కనిపిస్తే

కొత్త ఇంట్లో లేదా ఇంట్లోకి ప్రవేశించే సమయంలో బల్లి కనిపిస్తే అది పూర్వీకులు లేదా తండ్రి రాకకు సంకేతమట. పూర్వీకులు బల్లుల రూపంలో దర్శనమిచ్చి మనలను ఆశీర్వదించటానికి వస్తారని అర్థమట. అయితే మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు చనిపోయిన బల్లి లేదా మట్టిలో పాతిపెట్టినట్లు కనిపిస్తే అది అశుభ సంకేతం.

బల్లుల పోరాటం చూడటం

ఇంట్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ బల్లులు పోరాడుతున్నట్లు కనిపిస్తే అది అశుభ సంకేతాలను ఇస్తుంది. బల్లుల పోరు కూడా ఇంట్లోని వ్యక్తుల మధ్య రిలేషన్‌ షిప్‌ని దెబ్బతీస్తుందట. తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతాయి.

బల్లి నేల మీద నడిస్తే ఇంట్లో ఉన్న బల్లి భూమిలో పదే పదే కదులుతున్నట్లు లేదా పాకుతున్నట్లు కనిపిస్తే అది భూకంపం లేదా తుఫాను వంటి ప్రమాదాలను సూచించినట్లు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగిందని గమనించగలరు.

Read more RELATED
Recommended to you

Latest news