అదిరే LIC స్కీమ్.. రూ.10 వేలతో చేతికి రూ.4 లక్షలు…!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన పథకాల్లో డబ్బులు పెడుతున్నారు. ఇలా చేయడం వలన భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. అయితే చాలా మంది భారత ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ అందించే పాలసీలని తీసుకుంటూ వుంటారు. వీటి వలన చక్కటి లాభాలని పొందొచ్చు. చిన్నారుల నుంచి పెద్దల వరకు రకరకాల పాలసీలని తీసుకు వచ్చింది.

తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ బెనిఫిట్‌ ని కలిగించేవి కూడా వున్నాయి. LIC అందించే పాలసీల్లో ఆధార్‌ స్తంభ్‌ పాలసీ ఒకటి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూసేద్దాం. ఇది నాన్‌-లిక్డ్‌, లాభాపేక్షతో కూడిన ఎండోమెంట్‌ ప్లాన్‌. ఈ ప్లాన్ కింద మీరు నెలకు 901 ఆదా చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే కనుక దాదాపు రూ.4 లక్షలు పొందే ఛాన్స్ ఉంది. ఐదేళ్ల తర్వాత లాయల్టీ అడిషన్స్‌ కూడా లభిస్తాయి.

ఇక ఎవరు దీనికి అర్హులన్నది చూస్తే.. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్యలో వారు ఎవరైనా సరే ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.75,000 బీమా మొత్తాన్ని తీసుకోవాలి. గరిష్టంగా రూ. 3,00,000 మొత్తం వరకు దీని కింద తీసుకోచ్చు. డెత్‌ బెనిఫిట్స్‌ కూడా వున్నాయి. దీన్ని తీసుకున్న తొలి ఐదేళ్లలోనే మరణిస్తే ఆ పాలసీ మొత్తాన్ని నామినీకి ఇస్తారు.

అదే పాలసీదారుడు ఐదేళ్ల తర్వాత మరణిస్తే బీమా మొత్తంతో పాటు లయల్టీ అడిషన్స్‌ ఉంటాయి. 8 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు దీన్ని తీసుకుంటే పాలసీ టర్మ్‌ 20 ఏళ్లు. రూ.3 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే.. మొదటి ఏడాది ప్రీమియం రూ.10,541అవుతుంది. ఆరు నెలలకు రూ. 5327, మూడు నెలలకు రూ.2627, నెలకు రూ.898. రూపంలో దాదాపు రూ.2 లక్షలు. మెచ్యూరిటీ సమయంలో రూ.3 లక్షల బీమా.. లాయల్టీ అడిషన్ రూ.97,500. ఇలా దీని ద్వారా మీకు రూ.4 లక్షలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news