తెలంగాణలో 4 వెట‌ర్న‌రీ కాలేజీలు : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

-

ఇవాళ తెలంగాణ సిఎం కెసిఆర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  సిద్దిపేట తన పుట్టిన జిల్లా అని.. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు సీఎం కెసిఆర్ ప్రకటించారు. సిద్దిపేటతో సహా రాష్ట్రంలో మరో నాలుగు వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో ఈ వెటర్నరీ కాలేజీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గతంలో మంచి నీటికి ఇబ్బందులు పడ్డామని.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ నిండి ఉన్నాయని తెలిపారు. మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయని.. ఇందుకోసమే తెలంగాణను కోరుకున్నామని స్పష్టం చేశారు కెసిఆర్.

కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డామని.. ఉమ్మడి రాష్ట్రంలో ఒక సబ్ స్టేషన్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది అని గుర్తు చేశారు. కరెంటుతో ఎలాంటి బాధలు అనుభవించామో.. సిద్దిపేట వాసులకు బాగా తెలుసు అని… కాకతీయ రెడ్డి రాజులు గొలుసుకట్టు చెరువులు కట్టారని పేర్కొన్నారు. సమైక్య పాలనలో చెరువులన్నీ ధ్వంసమయ్యాయని.. తెలంగాణ రాక ముందే మిషన్ కాకతీయ రూపకల్పన చేశామని వెల్లడించారు. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news