40+ వాళ్ళు వీటిని పక్కా ఫాలో అయితే.. ఆర్థిక బాధలే ఉండవు.. హ్యాపీగా ఉండొచ్చు..!

-

వయసు పెరిగే కొద్దీ టెన్షన్లు ఎక్కువవుతాయి. బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. 40 దాటిన వాళ్ళు కచ్చితంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆర్థిక ఇబ్బందులతో కూరుకు పోవాల్సి ఉంటుంది. 40 దాటిన వాళ్లు భవిష్యత్తుకు భరోసా కల్పించేలా పెట్టుబడులు పెట్టాలి. పదవి విరమణ ప్రణాళికలను వేసుకోవాలి. స్థిరమైన ఆర్థిక భవిష్యత్తు కోసం 40 దాటిన తర్వాత ఖర్చులని కంట్రోల్ చేసుకోవాలి. ఆదాయం, ఖర్చులు ఆధారంగా బడ్జెట్ ని రూపొందించుకోవాలి. అవసరం లేని వాటి కోసం రూపాయి కూడా ఖర్చు చేయకూడదు.

పొదుపు ఆలోచన పెంచుకోవడం చాలా విలువైనది. అప్పుడే భవిష్యత్తుపై దృష్టి పెట్టడానికి అవుతుంది అలాగే అనుకోని సంఘటనల వలన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. దీనిని నివారించడానికి మీ పేరు మీద ఖచ్చితంగా బీమా పాలసీని తీసుకోండి వార్షిక ఆదాయానికి కనీసం 12 రెట్లు ఎక్కువ వచ్చే విధంగా బీమా పాలసీ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే డబ్బు కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారు. డబ్బుని ఆదా చేయడంతో పాటుగా సరైన పథకాల్లో పొదుపు చేయడం మంచిది.

సరిగ్గా పొదుపు చేస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండొచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించిన రాబడిని అందించడంతో పాటుగా సంపాదన పెంచడానికి అవుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాళ్లకు సరిపోయే అంత సమకూర్చాలి. వైద్య ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య భీమాని కూడా తీసుకోవడం మంచిది. పదవి విరమణకి ఇంకా 18 నుంచి 20 ఏళ్ల వయసు ఉంటుంది కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికతో సిద్ధం అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news