వియత్నాం వైద్యులని ఆశ్చర్యపరిచిన సంఘటన ఉత్కంఠ రేకెత్తిస్తుంది. మహిళ మూత్రాశయంలో 400గ్రాముల రాయిని బయటకి తీయడం వింతగా తోచింది. గత కొన్ని రోజులుగా వియత్నాం సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. బ్లాడర్ లో నుండి 400గ్రాముల రాయిని వెలికి తీయడం చిన్న విషయం కాదు. అంత పెద్ద రాయి మూత్రాశయంలో ఉండడం వల్ల ఆ మహిళ చాలా ఇబ్బందులు పడింది.
విషయంలోకి వెళ్తే, వియత్నాంలోని పూ బిన్ అనే హాస్పిటల్ కి 34సంవత్సరాల మహిళ వచ్చింది. బ్లాడర్ లో తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతుంది. పరిక్షలు జరిపి, సీటీ స్కాన్ నిర్వహించిన వైద్యులు, బ్లాడర్ లో పెద్ద సైజు రాయి ఉందని కనుగొన్నారు. వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయం తీసుకుని అత్యవసరంగా అన్నీ సమకూర్చుకుని సర్జరీ చేసారు. బ్లాడర్ లో నుండి 400గ్రాముల రాయిని తీసారు. పది సెంటిమీటర్ల పొడవు కలిగి ఉండి, 400గ్రాముల బరువుతో ఆశ్చర్యం గొలిపేలా ఉంది.
ప్రస్తుతం ఈ రాయి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాయిని తూకం వేస్తూ, నర్సు పట్టుకున్న ఫోటోలు అందరికీ ఆసక్తి కలిగించాయి. మూత్రాశయంలో అంతటి రాయిని బయటకి తీయడం రికార్డుగా నిలిచింది. గతంలో చైనాలో 100గ్రాముల రాయిని బయటకి తీసారు. ఇప్పుడు వియత్నాంలో 400గ్రాముల రాయి సర్జరీ ద్వారా తొలగించారు. ఐతే ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుండడంతో చూస్తున్న వాళ్ళంతా షాకవుతున్నారు. అంత పెద్ద రాయితో ఆమె ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుందో అని జాలి పడుతున్నారు. మన శరీరంలో అంత పెద్ద రాళ్ళకి కూడా ప్లేస్ ఉంటుందా అని ఆశ్చర్యమేస్తుంది కదూ..