ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పతంగి పార్టీ భారీ షాక్ తగిలింది. అసదుద్దుదీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి యూపీ ఓటర్లు షాక్ ఇచ్చారు. యూపీ ఎన్నికల్లో ఖాతా తెరుస్తామని అనుకున్న ఎంఐఎం పార్టీని యూపీ ఓటర్లు కనికరించలేదు. ముస్లీం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. యూపీలోని 403 స్థానాల్లో 100 స్థానాలకు ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. భగీరథ పరివర్తన్ పేరుతో కూటమి కట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఏ ఒక్క స్థానంలో కూడా ఖాతా తెరవలేదు. కేవలం 0.35 శాతం ఓట్లను మాత్రమే సంపాదించుకుంది.
అసదుద్దీన్ కు భారీ షాక్… యూపీలో ఎగరని ఎంఐఎం పతంగి
-