ఆడు మ‌గాడ్రా బుజ్జీ : జ‌గ‌న్ కు ఆ ప‌ని చేత‌గాదా? ఓవ‌ర్ టు కేసీఆర్

-

డైలాగ్ స్పీక్స్ వెల్
ఆడు మగాడ్రా బుజ్జీ
ప‌చ్చ‌ని చేల‌ల్లో
కాళేశ్వ‌రం నీళ్ల‌లో
మ‌ల్ల‌న సాగ‌రం ఉర‌వ‌ళ్ల‌లో
ఆడు మ‌గాడ్రా బుజ్జీ
మ‌ళ్లీ ఇప్పుడు
ఓయూ దారుల్లో
అసెంబ్లీ వెలుగుల్లో
ఆడు మ‌గాడ్రా బుజ్జీ

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కేసీఆర్ నామ జపమే వినిపిస్తోంది.ప్రజలకు ఏది అవసరమో అదే చేస్తూ అసలు సిసలు మగాడు అత‌డే అని ప్రజల చేత జయజయ ద్వానాలు పలికించుకుంటున్నారు.నేటి అసెంబ్లీలో ఉద్యోగులు మరియు నిరుద్యోగుల కోసం తాను తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిపోతాయన్న‌ది నిస్సందేహం.

కేసీఆర్ ఒక విష‌యాన్ని ఎంత క్లియర్ గా ప్రజలకు చెబుతారో మరోసారి తెలిసింది.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు మరియు ఎన్నింటినీ తక్షణమే భర్తీ చేయనున్నారు అన్నది చెప్పేశారు.ప్రజల కోసమే పాలన చేస్తున్న ఒక యోధుడిలాగా కేసీఆర్ సాగిపోతున్నారు.నిరుద్యోగుల చీక‌టి జీవితాల్లో వెలుగును నింపే ఒక నిప్పుకణంలా మారిపోయారు.

కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా ఏపీలో జగన్ పాలన సాగుతోంది అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.అవును!గురూ ఇది నిజం… ఏపీలో నిరుద్యోగులు లేరా? ప్రభుత్వ  ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశాలు లేవా? అన్నీ ఉన్నాయి అయినా ఎందుకో ఏమరుపాటు.నిరుద్యోగులు బాగుపడితే ఎలాగా? అన్న చందంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు ఉంది..అన్న‌ది విప‌క్ష ఆరోప‌ణ‌. అధికారంలోకి రాక ముందు అమాయక ప్రజలకు చెప్పిన మాటలు,నిస్సహాయ నిరుద్యోగులకు చేసిన వాగ్దానాలు ఇప్పటికీ ప్రతి ఒక్కరి చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి.కానీ వాస్తవ రూపం దాల్చడం కోసం ఇంకెన్నాళ్లు? మరి! ఇప్పటికైనా ఏపీ సీఎం జగన్ పక్క రాష్ట్ర సీఎం పాలనాతీరును గమనించి ఆచరణలో పెట్టాల్సిందిగా నిరుద్యోగుల త‌ర‌ఫున మనవి.

– వంశీ – తెలంగాణ పొలిటిక‌ల్ ఎఫైర్స్

– మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Exit mobile version