షాకింగ్ : ఒకే రోజు తెలంగాణ నదుల్లో ఆరుగురు గల్లంతు

ములుగు జిల్లాలో విషాదం జరిగింది. గోదావరిలో ఈతకు వెళ్లిన 16 మందిలో నలుగురు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవులో ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారిలో ఒకరు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక మరో పక్క నిజాంసాగర్‌ ప్రాజెక్టులో పడి ఇద్దరు యువకులు మృతిచెందారు. ప్రాజెక్టు 16వ గేటు వద్ద స్నానం చేస్తుండగా.. యువకులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు గజ ఈతగాళ్లు.

ప్రాజెక్టు అందాలు చూసేందుకు ఐదుగురు స్నేహితులు వెళ్లగా.. ఇద్దరు ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ములుగు జిల్లాలో స్నేహితులు పుట్టినరోజు రోజు సందర్బంగా గోదావరి తీరానికి వెళ్లిన 16 మంది ఈ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా గోదావరి స్నానాలకు వెళ్లగా అందులో నలుగురు గల్లంతు అయ్యారు. ఇక అటు ఒడ్డుకు చేరి ఉంటారని ముందు అనుమానాలు వ్యక్తం కాగా గల్లంతైన వారి కోసం స్థానికులు, పోలీసులు వెతుకుతున్నారు.