ఏపీలో నూతనంగా 60 కార్పొరేషన్ల ఏర్పాటుకు సిద్ధం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా 60 కార్పొరేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో బీసీలకు 57, ఈబీసీలకు 3 కార్పొ రేషన్లు ఉన్నాయి. బీసీల్లో ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

సామాజిక వర్గాల వారీగా విభజన చేసి బీసీలకు 57, ఈబీసీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 30 కార్పొరేషన్లు ఉండగా బీసీ సంక్షేమ శాఖ ప్లాన్- ఏ కింద 16, ప్లాన్ -బీ కింద మరో 41 కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. కమ్మ, రెడ్డి, క్షత్రియులకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news