జనజీవన స్రవంతిలోకి 65 మంది నక్సల్స్.. నేడే విడుదల

-

ఛత్తీస్​గఢ్ పోలీసుల ఎదుట గత 20 రోజుల్లో 65 మంది నక్లలైట్లు లొంగిపోయారు. పోలీసులు చేపట్టిన ‘లోన్ వరాటు’ (ఇంటికి తిరిగి రండి) కార్యక్రమమే ఇందుకు కారణం. లొంగిపోయిన నక్సల్స్​కు పునరావాసంతో పాటు ఉపాధి కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్​గఢ్ పోలీసులు చేపట్టిన ‘లోన్ వరాటు’ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోంది. దీనితో గత 20 రోజుల్లో 65 మంది నక్సల్స్… పోలీసుల ఎదుట లొంగిపోయారు.దంతెవాడ జిల్లాలోని చిక్పాల్ గ్రామంలో 20 రోజుల క్రితం పోలీసులు ‘లోన్ వరాటు’ (మీ ఇంటికి తిరిగి రండి) కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి గ్రామానికి వెళ్లి స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించారు.

Naxals
Naxals

గ్రామస్థులకు ఫోన్ నంబర్లు ఇచ్చిన పోలీసులు… లొంగిపోవాలనుకునే నక్సల్స్ నేరుగా తమను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఫలితంగా ఇప్పటి వరకు 65 మంది లొంగిపోయారు. వీరిలో చాలా మందిపై లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
జులై 8న బజే గుజ్రాలో లొంగిపోయిన కొంతమంది నక్సల్స్… వ్యవసాయం చేసుకునేందుకు ట్రాక్టర్ కావాలని కోరారు. దీనితో అధికారులు స్వయం సహాయక బందాలు ఏర్పాటు చేసి, వారికి ట్రాక్టర్​ను మంజూరు చేశారు. మరో 10 మందికి ట్రాక్టర్​ సహా వ్యవసాయ పరికరాలు కూడా అందించారు.2005 నుంచి నక్సల్స్ జనజీవన స్రవంతిలోకి రావాలని ఛత్తీస్​గఢ్ పోలీసులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. లొంగిపోయిన వారికి పునరావాసం, ఉపాధి కల్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news