వేంకటాద్రిరామునిగా శ్రీ మలయప్పస్వామి !

-

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 24 ఆరో రోజు గురువారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు వేంకటాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు.

హనుమంత వాహనం – భగవత్ భక్తి ప్రాప్తి

హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. కాగా సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనసేవ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు గజవాహనంపై శ్రీమలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. ఈ స్వామి సేవ చూసినవారికి శ్రీలక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news