కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో గురువారం (24-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. తెలంగాణలో కొత్తగా 2,176 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,79,246కు చేరుకుంది. 1,070 మంది చనిపోయారు. 30,037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,48,139 మంది కోలుకున్నారు.
2. దేశంలో కొత్తగా 86,508 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 57,32,519కు చేరుకుంది. 9,66,382 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 46,74,988 మంది కోలుకున్నారు. 91,149 మంది చనిపోయారు.
3. ఏపీలో కొత్తగా 7,855 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,54,385కు చేరుకుంది. 69,353 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,79,474 మంది కోలుకున్నారు. 5,558 మంది చనిపోయారు.
4. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ అభివృద్ధి చేస్తున్న నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థ అంగీకారం తెలిపింది. దీంతో త్వరలోనే ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి చేయనున్నారు.
5. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్‌కు కరోనా సోకింది. దీంతో ఆయనను చెన్నైలోని రామపురం ఎంఐవోటీ హాస్పిటల్‌లో చేర్పించినట్లు తెలిసింది. కాగా గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
6. జాన్సస్ అండ్ జాన్సన్ కంపెనీ తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌కు గాను 3వ దశ ట్రయల్స్‌ను చేపట్టనున్నట్లు తెలిపింది. ఇటీవలే రెండో దశ ట్రయల్స్ పూర్తయిన నేపథ్యంలో త్వరలో చివరి దశ ట్రయల్స్ ను చేపట్టనుంది.
7. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. అక్కడి రాజ్ భవన్‌లో ఒక అధికారికి కరోనా రావడంతో ఆయన అన్నిఅపాయింట్‌మెంట్లను రద్దు చేసుకుని ఐసొలేషన్‌లోకి వెళ్లిపోయారు.
8. కరోనా బారిన పడి ప్రముఖ సైంటిస్టు, అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ శేఖర్ బసు కన్ను మూశారు. కోల్‌కతాలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన చనిపోయారు.
9. జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల కోవిడ్ బారిన పడ్డవారు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయని స్పెయిన్‌కు చెందిన సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
10. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా టెస్టులు ఎందుకు ఎక్కువగా చేయడం లేదని ప్రశ్నించింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కువగా టెస్టులు చేస్తుంటే తెలంగాణలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది.